ధనుష్ తో నాగ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు !

ధనుష్ తో నాగ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు !

Published on Aug 2, 2018 5:00 PM IST

nagarjuna dhanush

కింగ్ నాగార్జున ప్రస్తుతం నాని తో కలిసి ‘దేవదాస్’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. భలే మంచి రోజు చిత్ర దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈనెలలో షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఈ చిత్రం తో పాటు నాగ్ హిందీ లో అమితాబ్ బచ్చన్ , రన్బీర్ కపూర్ లతో కలిసి ‘బ్రహ్మస్త్ర’ అనే చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈచిత్ర షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు.

ఇక ప్రస్తుతానికి నాగ్ చేతిలో ఈరెండు చిత్రాలు తప్ప వేరే కొత్త సినిమాలు లేవు. ఇక ఇప్పుడు నాగ్ కోలీవుడ్ లో ధనుష్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నాడని సమాచారం. నాగ్ , ధనుష్ తో సినిమా చేయనున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నాగ్ ఈ వార్తలను త్వరలోనే నిజం చేయనున్నారు.

తాజా వార్తలు