నాగ్ – కార్తీల ‘ఊపిరి’ రిలీజ్ డేట్

Oopiri
తెలుగు, తమిళంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోస్ కింగ్ నాగార్జున – యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో రానున్న మల్టీ స్టారర్ మూవీ ‘ఊపిరి’. భారీ అంచనాలున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా కనిపించనున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ చూటింగ్ చివరి దశకు చేసుకుంది. ఒక నెల రోజుల షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉన్న ఈ సినిమా షూట్ ని డిసెంబర్ మిడిల్ కల్లా ఫినిష్ చేయనున్నారు.

ముందుగా ఈ సినిమాని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నా షూటింగ్ లో జాప్యం వలన వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని ఇదివరకే తెలియజేశాం. తాజాగా ఈ చిత్ర టీం ఊపిరి రిలీజ్ కోసం రిలీజ్ డేట్ ని లాక్ చేసింది. వచ్చే ఏడాది అనగా 2016 ఫిబ్రవరి 5న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. నాగార్జున ఈ సినిమాలో ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క – అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్’ కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతోంది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version