పాటల చిత్రీకరణలో నాగ్, నాని మల్టీ స్టారర్ !

సీనియర్ స్టార్ హీరో నాగార్జున, యువ హీరో నాని కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్లో ఈ చిత్రానికి సంబందించిన ఒక పాట చిత్రీకరణ జరుగుతోంది. అందులో నాగ్, నాని ఇద్దరూ కలిసి ఈ నటిస్తున్నారు.

ఈ సాంగ్ ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రేమ్ రక్షిత్ పర్యవేక్షణలో జరుగుతోంది. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్ పాత్రలో కనిపించనుండగా నాని డాక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ స్కీన్ షేర్ చేసుకోనుంది.

Exit mobile version