నాగ్, నానిల సినిమా ఒక జానర్లో ఉండదట !

నాగ్, నానిల సినిమా ఒక జానర్లో ఉండదట !

Published on Mar 8, 2018 11:46 AM IST

సీనియర్ స్టార్ హీరో నాగార్జున, సక్సెస్ ఫుల్ యంగ్ హీరో నాని కలిసి ఒక మల్టీ స్టారర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా గురించి శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ఈ చిత్రం ఒక జానర్లో ఉండదని తన గత సినిమాల్లానే పలు రకాల జానర్లలో ఉంటుందని అన్నారు.

ప్రస్తుతానికైతే ఈ చిత్రం మంచి ఫన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుండగా ఇందులో ఇంకెన్ని వేరియేషన్స్ ఉంటాయో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. అలాగే నాగ్, నానిల మధ్య ఆన్ స్క్రీన్ రిలేషన్ చాలా గొప్పగా ఉంటుందని కూడ ఆదిత్య అన్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరనేది ఇంకా ఖారారు కాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు