సాంగ్ షూట్ లో సోగ్గాడు బిజీ

soggade_chinni_nayan-(1)
‘మనం’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కింగ్ అక్కినేని నాగార్జున చేస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయన’. నాగార్జున రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ జూన్ 28న రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. నిన్ననే రమ్యకృష్ణ కూడా ఈ సినిమా సెట్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాల్ని అందరి నటీనటులపైన ఓ ఫ్యామిలీ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ షూట్ లో నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, సంపత్, అనసూయ, హంసా నందిని, నాజర్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొంటున్నారు.

మరో రెండు మూడు రోజుల్లో ఈ సాంగ్ షూట్ ని ఫినిష్ చేస్తారు. జూలై మొదటి వారం వరకూ ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ షెడ్యూల్ తో చాలా వరకూ షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే నాగార్జున కార్తీ తో కలిసి చేస్తున్న వంశీ పైడిపల్లి సినిమాకి షిఫ్ట్ అవుతాడు.

Exit mobile version