అందరం గర్వపడేలా చేశావ్ చరణ్ – నాగబాబు

Published on Feb 26, 2023 6:40 pm IST

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను గెలుపొందిన ఈ చిత్రం, ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రం తో ఇంటర్నేషనల్ రేంజ్ లో రామ్ చరణ్ కి వస్తున్న ఆదరణ పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ లిస్ట్ లో తాజాగా టాలీవుడ్ నటుడు, నిర్మాత, రామ్ చరణ్ బాబాయ్ అయిన నాగబాబు చేరారు. రామ్ చరణ్ ఎదుగుదల పై సంతోషం వ్యక్తం చేశారు. నా ప్రియమైన చరణ్ బాబు, మన కుటుంబ వారసత్వాన్ని అంతర్జాతీయ తీరాలకు నడిపించడం ద్వారా గుర్తింపు తెచ్చుకొని, మా అందరినీ మీరు గర్వపడేలా చేశారు. లవ్ యూ అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించగా, ఇప్పుడు నాగబాబు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :