నాగబాబు : పవన్‌కి అప్పట్లో మార్గనిర్దేశం చేశాను, ఇప్పుడు ఆయన్ను అనుకరిస్తున్నాను

నాగబాబు : పవన్‌కి అప్పట్లో మార్గనిర్దేశం చేశాను, ఇప్పుడు ఆయన్ను అనుకరిస్తున్నాను

Published on Jun 11, 2023 3:00 AM IST

Naga Babu

మెగాబ్రదర్ నాగబాబు ప్రస్తుతం ఇటు సినిమాలతో పాటు అటు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కార్యకలాపాల్లో కూడా విరివిగా పాల్గొంటున్నారు. ఇక ఆయన కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరియు యువ బ్యూటీ లావణ్య త్రిపాఠి నిన్న నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా వారిని ఇరు కుటుంబ సభ్యులు ఆశీర్వదించారు. ఇక వారి నిశ్చితార్ధం పిక్స్ ని ఆన్‌లైన్‌లో నిన్న షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు నాగబాబు.

ఇతర మెగా కుటుంబసభ్యులతో పాటు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరుకావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్‌తో దిగిన ఫోటోను పంచుకున్న నాగబాబు దానిని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. చిన్న‌ప్పుడు తమ్ముడు పవన్ ని జీవితంలో ఎలా క‌రెక్ట్‌గా ముందుకు సాగాలో గైడ్ చేసేవాడినని అయితే తను పెరిగేకొద్దీ పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సరైన మార్గాన్ని లోతుగా అర్థం చేసుకున్నానని, అందుకే తాను కూడా పవన్ అడుగుజాడలను అనుకరిస్తున్నానని నాగబాబు తెలిపారు. మొత్తంగా పవన్, నాగబాబు ల పిక్స్ ని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తున్న మెగా గ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

తాజా వార్తలు