నాన్న పేరు చెప్పి తప్పించుకుందాం అనుకున్నా – నాగ చైతన్య
Published on May 30, 2018 5:39 pm IST

‘మహానటి’ సినిమా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రేక్షకులకి చాలా ప్రత్యేకతలే కనబడ్డాయి. వాటిలో ఏఎన్నార్ పాత్రను ఆయన మనువడు, హీరో నాగ చైతన్య చేయడం కూడ ఒకటి. అక్కినేని పాత్రలో చైతూ నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కింది. దీని గురించి నాగచైతన్య మాట్లాడుతూ ‘నాగ్ అశ్విన్ నా వద్దకు ఈ ఆఫర్ తీసుకురాగానే చేయగలనో లేదో అనే సందేహంతో నాన్న నో చెప్తే ఆయన పేరే చెప్పి తప్పిచుకుందాం అనుకున్నాను’ అన్నారు.

అలాగే ‘ఆ పాత్రను నేను కాకుండా వేరే వాళ్ళు చేసుంటే సినిమా విడుదలయ్యాక చాలా ఫీలై ఉండేవాడిని. నాగి అండ్ టీమ్ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అసలు దేవదాసులోని తాతగారి పాత్రను చేస్తానని కలలో కూడ అనుకోలేదు. నావి 2 నిముషాల సన్నివేశాలే కానీ షూటింగ్ సయయంలో చాలా కంగారుపడ్డాను’ అంటూ తన మనసులోని మాటల్ని బయటపెట్టారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook