ఒకే నెలలో అక్కినేని హీరోల సందడి

Published on Mar 3, 2020 12:17 am IST

అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ కొత్త సినిమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ ముగిసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలవుతుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చైతన్య చేస్తున్న ‘లవ్ స్టోరీ’, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చేస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ రెండూ కూడా ప్రేమ కథా చిత్రాలే. ఇలా రెండు చిత్రాలు కథ విషయంలోనే కాదు రిలీజ్ డేట్ విషయంలో కూడా ఒకేలా ఉన్నాయి.

చైతన్య చిత్రం ‘లవ్ స్టోరీ’ మే నెలలోనే విడుదలకానుండగా అఖిల్ సినిమా కూడా అదే నెలలో రానుంది. అంటే మే నెలలో అక్కినేని అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెండు ట్రీట్స్ పక్కా. నాగ చైతన్య చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ కాగా అఖిల్ సినిమాలో హాట్ షాట్ పూజా హెగ్డే కనువిందు చేయనుంది. ఈ సినిమాలపై అక్కినేని ఫ్యాన్స్ బోలెడు అంచనాలు పెట్టుకున్నారు. రెండూ విజయం సాధిస్తే ఇద్దరు హీరోలు హిట్ ట్రాక్లో ఉంటారని ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More