‘మజిలి’కి సిద్ధం అయిన చైతు, సమంత !

‘మజిలి’కి సిద్ధం అయిన చైతు, సమంత !

Published on Aug 21, 2018 8:52 AM IST


నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వవంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా జులైలో ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ నెలాఖరులో షూటింగ్ కి వెళ్తానికి సిద్ధంగా ఉంది. అయితే గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

కాగా ఈ చిత్రం టైటిల్‌ ‘మజిలి’ అంటూ గతంలోనే సోషల్ మీడియాలో ఆ టైటిల్ హల్‌చల్‌ చేసింది. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఆ టైటిల్ నే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే మజిలీ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించారట. ఇక ఈ చిత్రంలో భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కనుంది. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు