అఖిల్ సినిమాలో చైతూ గెస్ట్‌రోల్ లేదా?

అఖిల్ సినిమాలో చైతూ గెస్ట్‌రోల్ లేదా?

Published on Apr 29, 2015 11:23 AM IST

naga-chaitanya
అన్నయ్య.. తాత, తండ్రి నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కొత్తదనమున్న కథలతో దూసుకుపోతున్న లవర్ బాయ్. తమ్ముడు.. ఫస్ట్‌లుక్ టీజర్‌తోనే స్టార్ హీరోగా ఎదిగే రేంజ్ గల హీరో అనే అభిప్రాయాల మధ్య తెలుగు తెరకు పరిచయం కానున్న మరో వారసుడు. వారే అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్. ఇంతకుముందు వీరిద్దరూ ‘మనం’ సినిమాలో కొద్దిసేపు అలా మెరిసి మురిపించారు. తాజాగా వీరిద్దరూ మరోసారి కలిసి నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై నాగ చైతన్య ఓ క్లారిటీ ఇచ్చారు.

అక్కినేని అఖిల్‌ను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ హీరో నితిన్ ఓ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విషయంలో ప్రతిదీ పక్కాగా, చాలా స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే అఖిల్ సినిమాలో నాగ చైతన్య గెస్ట్ రోల్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతానికైతే అలాంటి ప్రపోజల్ ఏదీ లేదని నాగ్ చైతన్య స్పష్టం చేశారు.

తాజా వార్తలు