స్విట్జర్ ల్యాండ్ లో స్టెప్స్ వేస్తున్న నాగ చైతన్య

స్విట్జర్ ల్యాండ్ లో స్టెప్స్ వేస్తున్న నాగ చైతన్య

Published on Jun 18, 2014 8:42 AM IST

naga-chaithanya
‘మనం’ సినిమా విజయంతో అత్యంత ఉత్సాహంగా పనిచేస్తున్న యంగ్ హీరో నాగ చైతన్య ఇప్పటికే ‘ఒక లైలా కోసం’ సినిమా టాకీ పార్ట్ ని పూర్తి చేసాడు. ప్రస్తుతం బాలన్స్ ఉన్న కొన్ని సాంగ్స్ ని స్విట్జర్ ల్యాండ్ లో షూట్ చేస్తున్నారు. ఈ పాటల కోసం నాగ చైతన్య – పూజ హెగ్డే కలిసి స్టెప్పులు వేస్తున్నారు.

ఈ స్విట్జర్ ల్యాండ్ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.’గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని నిర్మిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే చాలా కాలం నుంచి విడుదలకు నోచుకోని నాగ చైతన్య ‘ఆటో నగర్ సూర్య’ సినిమాని ఈ నెల 27న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా నాగ చైతన్య – సుదీర్ వర్మల మూవీ జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజా వార్తలు