‘దేవర సీక్వెల్’ కచ్చితంగా ఉంటుందని ఇప్పటికే ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు. కాగా ‘దేవర పార్ట్-2’ షూట్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఉంటుందని టాక్ కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టు ఉండి, దర్శకుడు కొరటాల శివ మరియు బాలయ్య ప్రాజెక్ట్ సెట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా దేవర 2 కంటే కూడా ఈ సినిమానే ముందు స్టార్ట్ అయిపోవచ్చని టాక్ నడుస్తోంది. కానీ, తాజాగా ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. కచ్చితంగా ముందు దేవర 2నే ఉంటుందట. అందుకు నిదర్శనంగా ‘దేవర సీక్వెల్’కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ రెడీ పూర్తి అయ్యాయి.
కాగా ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ పై వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొరటాల శివ ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం కసరత్తులు చేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.


