“కస్టడీ” పై నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

“కస్టడీ” పై నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 4, 2023 10:14 PM IST

Custody 4
టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నాగ చైతన్య త్వరలో విడుదల కానున్న తెలుగు – తమిళ ద్విభాషా చిత్రం కస్టడీతో తమిళంలోకి అడుగుపెట్టనున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటించింది. మే 12న కస్టడీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా థియేటర్ల లో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కస్టడీ టీమ్ హైదరాబాద్‌లో తెలుగు సినిమా మీడియాతో ముచ్చటించింది.

ఇంటరాక్షన్ సందర్భంగా, హీరో నాగ చైతన్య మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కస్టడీ అనేది తన మొట్టమొదటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ అని, ఈ చిత్రం తన కెరీర్‌లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని చెప్పాడు. కస్టడీ అనేది విలన్‌ను మరణం నుండి రక్షించడానికి హీరో తీవ్రంగా శ్రమించే ఒక ప్రత్యేకమైన మరియు ఉత్తేజకరమైన థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ చాలా అరుదు అని నాగ చైతన్య అన్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

తాజా వార్తలు