సాయంత్రమే నాగ చైతన్య కొత్త సినిమా టీజర్ విడుదల

సాయంత్రమే నాగ చైతన్య కొత్త సినిమా టీజర్ విడుదల

Published on Nov 22, 2014 1:48 PM IST

Naga-Chaitanya-new (1)

రేపు, నవంబర్ 23న అక్కినేని యువ అందగాడు నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా అతని కొత్త సినిమా టీజర్ ను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్టు చైతు సోషల్ మీడియాలో వెల్లడించారు.

చైతు సరసన ‘1 నేనొక్కడినే’ ఫేం కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎస్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సన్నీ ఎంఆర్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేశారంటూ పలు పేర్లు మీడియాలో ప్రచారంలోకి రాగా దర్శకుడు వాటిని ఖండించారు.

తాజా వార్తలు