టీజర్ తో అలరిస్తున్న నాగ చైతన్య, రకుల్ ప్రీత్ !


నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. శనివారంతో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకునం ఈ సినిమా యొక్క టైటిల్ సాంగ్ టీజర్ ను నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఆ టీజర్ చూస్తే సినిమా అచ్చమైన పల్లెటూరి నైపథ్యంలో తెరకెక్కిన కుటుంబ కథా చిత్రంలా ఉండేట్టు కనిపిస్తోంది. అలాగే నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య నడిచే రొమాన్స్ కూడా చాలా కొత్తగా ఉంది.

పైగా టీజర్ కంటే ముందుగానే విడుదలైన టైటిల్ సాంగ్ కూడా గొప్పగా ఆకట్టుకుంటోంది. ఆ పాట ‘బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ..’ వింటే సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఏ స్థాయిలో అలరిస్తుందో అర్థమైపోతుంది. ఇలా కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అన్ని హంగులతో మే 26న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం ఈ వేసవికి మంచి వినోదాన్ని అందివ్వడం ఖాయమనే నమ్మకం కలుగుతోంది. గతంలో నాగార్జున ప్రధాన పాత్రలో కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ కూడా ఫ్యామిలీ ఆడియన్సును విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

టైటిల్ సాంగ్ టీజర్ కొరకు క్లిక్ చేయండి :