నాగ చైతన్య, రష్మికల సినిమా రివీల్ అయింది?

Published on Sep 12, 2019 8:06 pm IST

నాగ చైతన్య, రష్మిక మందన్నల సినిమా ఫైనల్ అయిందా అంటే అవుననే అనాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ యొక్క శాటిలైట్ హక్కుల్ని తామే కొనుగోలు చేశామని ప్రముఖ ఛానెల్ జెమినీ టీవీ ప్రకటించింది. అంతేకాదు సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ అనేది టైటిల్ అని కూడా రివీల్ చేసింది.

ఇలా మేకర్స్, నటీనటుల నుండి కాకుండా శాటిలైట్ హక్కుదారుల నుండి సినిమా ప్రకటన జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, నిర్మాణం ఎవరు చేస్తున్నారు, షూట్ ఎప్పుడు మొదలవుతుంది వంటి వివరాలు
ఖచ్చితంగా తెలియాల్సి ఉంది.

ఇకపోతే చైతూ ప్రస్తుతం ‘వెంకీ మామ’తో పాటు శేఖర్ కమ్ముల సినిమా చేస్తుండగా, రష్మిక మహేష్ యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ నితిన్ చేస్తున్న ‘భీష్మ’ చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More