‘శైలజా రెడ్డి అల్లుడు’ అనుకున్న తేదీ ప్రకారం రావడం కష్టమే ?

Published on Aug 20, 2018 1:54 pm IST

మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రం కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల అవ్వనుందని ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘శైలజా రెడ్డి అల్లుడు’ విడుదల తేదీ పోస్ట్ ఫోన్ అయ్యేలా కనిపిస్తోంది. గత కొద్ది వారాల నుండి కేరళలో ఈ చిత్రం రీ-రికార్డింగ్ వర్క్ జరుగుతోంది. ప్రస్తుతం కేరళలో వరదలు కారణంగా రీ-రికార్డింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తవలేదని సమాచారం.

ఇంకా చిత్రం విడుదలకు కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి ఈ లోగా వర్క్ పూర్తిగా అవ్వటం సాధ్యం కాకపోవచ్చు. ఐతే విడుదల తేదీ వాయిదా పడుతున్నట్లు మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తుండగా చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More