నాగ చైతన్య, సమంతల ‘మజిలి’ !

Published on Aug 16, 2018 10:58 am IST

నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వవంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

కాగా తాజాగా ఈ చిత్రం టైటిల్‌ ఇదేనంటూ సోషల్ మీడియాలో ‘మజిలి’ అనే టైటిల్ హల్‌చల్‌ చేస్తోంది. ఆగష్టు మూడో వారంలో షూట్ మొదలు కానున్న ఈ చిత్రం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కబోతుందట. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More