తమ సినిమాలో భార్యాభర్తల అనుబంధాన్ని చెప్పబోతున్న ‘క్రేజీ కపుల్’

తమ సినిమాలో భార్యాభర్తల అనుబంధాన్ని చెప్పబోతున్న ‘క్రేజీ కపుల్’

Published on Aug 7, 2018 4:29 PM IST

chai sam

నాగచైతన్య, సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత సినిమాలను కంటిన్యూ చేస్తూ వరుసగా విజయాలు అందుకుంటున్నారు. కాగా ‘నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో కూడా సామ్ చై భార్యాభర్తలుగానే నటించనున్నారు. అంటే తమ రియల్ లైఫ్ లోని బంధాన్ని రీల్ లైఫ్ లో కూడా కంటిన్యూ చేయనున్నారు. అయితే భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రకథను తయారు చేశారట. సినిమాని కూడా అలాగే తెరకెక్కించనున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు మధ్య సర్వసాధారణంగా వచ్చే అభిప్రాయభేదాలను, అపోహలను ఎలా ఎదురుకొని తమ బంధాన్ని ఎలా నిలుపుకున్నారు అనే అంశాన్ని హైలెట్ గా చూపించనున్నారు. ఏమైనా తమ పెళ్లి తర్వాత సమంత, నాగ చైతన్య కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

తాజా వార్తలు