ట్రెండీ లుక్‌తో షూటింగ్ మొదలుపెట్టిన చైతూ

ట్రెండీ లుక్‌తో షూటింగ్ మొదలుపెట్టిన చైతూ

Published on Apr 18, 2025 3:00 AM IST

అక్కినేని నాగచైతన్య రీసెంట్‌గా ‘తండేల్’ మూవీతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రాజు అనే పాత్రలో రఫ్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను తన పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక కొంత గ్యాప్ తీసుకుని, ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు.

దర్శకుడు కార్తిక్ దండు డైరెక్షన్‌లో ఓ మిస్టిక్ థ్రిల్లర్ మూవీలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసి చాలా రోజులే అయింది. ఇక తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో నాగచైతన్య పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమా కోసం సరికొత్త స్టైలిష్ అండ్ ట్రెండీ లుక్‌లోకి చైతూ మారాడట.

ఈ సినిమా చైతూ కెరీర్‌లో 24వ చిత్రంగా తెరకెక్కుతుండటంతో NC24 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు