నాగ చైతన్య నెక్స్ట్ మూవీ టైటిల్ ‘దోచెయ్’.?

నాగ చైతన్య నెక్స్ట్ మూవీ టైటిల్ ‘దోచెయ్’.?

Published on Dec 9, 2014 3:30 AM IST

naga-chaitayna-sudeer-var
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం ‘స్వామి రారా’ సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే నాగ చైతన్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. టైటిల్ విషయంలో పలు పేర్లు వినిపిస్తున్నా ఈ చిత్ర టీం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రొడక్షన్ టీం తమ బ్యానర్ లో ‘దోచెయ్’ అనే టైటిల్ ని ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసారు. సుధీర్ వర్మ సినిమాలో నాగ చైతన్య పాత్ర కూడా దొంగే కావడంతో ‘దోచెయ్’ అనే టైటిల్ నాగ చైతన్య నెక్స్ట్ సినిమాకే అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ టైటిల్ పై ఈ చిత్ర టీం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. నాగ చైతన్య సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సన్నీ ఎం.ఆర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు