మజిలీ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన చైతూ !

Published on Mar 16, 2019 10:00 pm IST

యువ సామ్రాట్ నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజిలీ విడుదలకు సమయం దగ్గర పడింది. ఇక మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చైతూ తన పాత్ర కు డబ్బింగ్ చెపుతున్నాడు. ఇక ఇటీవల విడుదల చేసిన సాంగ్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించారు.

ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో దివ్యాంశ కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More