నాగ చైతన్య చేతుల మీదుగా ‘చిలసౌ’ కాన్సెప్ట్ పోస్టర్ !

నాగ చైతన్య చేతుల మీదుగా ‘చిలసౌ’ కాన్సెప్ట్ పోస్టర్ !

Published on May 2, 2018 9:48 AM IST

సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ రూపొందించిన చిత్రం ‘చిలసౌ’. షూటింగ్ పార్టీ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ను హీరో అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదలచేయనున్నారు.

సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై జస్వంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రుహాని శర్మ కథానాయకిగా పరిచయంకానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతాన్ని అందించారు. కొన్నాళ్లుగా కెరీర్లో సరైన విజయంలేని సుశాంత్ ఈ చిత్రంతో మంచి సక్సెస్ పొందాలని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు