క్రికెటర్ పాత్రలో కనిపించనున్న నాగ చైతన్య !

క్రికెటర్ పాత్రలో కనిపించనున్న నాగ చైతన్య !

Published on Jun 19, 2018 12:09 PM IST

nagachaitanya

అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. చందు మొండేటి తెరకెక్కిస్తున్న ‘సవ్యసాచి’ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసిన చైతు ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక ఈ సినిమాల తరువాత నాగ చైతన్య ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చైతు క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. తన మొదటి సినిమా నుండి పెద్దగా ప్రయోగాల జోలికి పోకుండా లవర్ బాయ్ పాత్ర్రల్లో, యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న అయన ఫస్ట్ టైం స్పోర్ట్స్ జోనర్లో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో చైతు కు జోడిగా సమంత నటించనున్నారు. పెళ్లి తరువాత వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఫై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించనున్నారు .

తాజా వార్తలు