‘ఓ బేబీ’ చూసిన చైతన్య రియాక్షన్ ఏంటి ?

Published on Jun 16, 2019 11:00 pm IST

‘సూపర్ డీలక్స్, మజిలీ’ లాంటి వరుస విజయాలతో ఆకట్టుకున్న సమంత అక్కినేని చేసిన కొత్త చిత్రం ‘ఓ బేబీ’. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సమంత భిన్నమైన రోల్ చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ వినోదాత్మకంగా ఉండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం బాగానే జరుగుతోందని టాక్.

ఇక సమంత చేసే ప్రతి సినిమాను విడుదలకు ముందుగానే వీక్షించే ఆమె భర్త, హీరో నాగ చైతన్య ‘ఓ బేబీ’ని కూడా చూశారట. సినిమా చూస్తున్నంతసేపు చైతన్య చాలా బాగా ఎంజాయ్ చేశాడట. అంటే సమంత చెప్పిన్నట్టు సినిమాలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు బాగానే ఉన్నాయని అర్థమవుతోంది. జూలై 5వ తేదీన విడుదలకానున్న ఈ సినిమాను సురేష్ బాబు, సునీతా తాటి సంయుక్తంగా నిర్మించారు. ఇది కాకుండా సమంత మన్మథుడు 2, 96 తెలుగు రీమేక్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More