కలిసొచ్చిన తేదీలోనే సినిమాను రిలీజ్ చేయనున్న నాగ చైతన్య !

కలిసొచ్చిన తేదీలోనే సినిమాను రిలీజ్ చేయనున్న నాగ చైతన్య !

Published on Apr 11, 2017 4:12 PM IST

rarandoi Vedukachudham
‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి రెండు వరుసగా హిట్లు ఖాతాలో వేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్న నాయాన’ లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు నాగ చైతన్యను కూడా పూర్తి రొమాంటిక్ యాంగిల్ లో చూపించనున్నాడు. ఈ చిత్రానికి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆనే టైటిల్ ను ఖరారు చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ కూడా మంచి స్పందన తెచ్చుకుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరగా ముగించి మే 19వ తేదీన రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మే నెల నాగ చైతన్యకు బాగా కలిసొచ్చిన నెల. ఎందుకంటే గతంలో ఆయన నటించిన ‘100 % లవ్, మనం, తడాఖ’ చిత్రాలన్నీ మేలోనే రిలీజై ఘన విజయం సాధించాయి. అందుకే ఆ నెలలోనే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు