బేబీ గర్ల్ ని బ్రతికించిన నాగ చైతన్య

బేబీ గర్ల్ ని బ్రతికించిన నాగ చైతన్య

Published on Jul 12, 2015 7:10 PM IST

naga-chaitnya
ఈ మధ్య కాలంలో ఫిల్మ్ స్టార్స్ లో చాలా మార్పు వచ్చింది. కేవలం తమ పని తాము చేసుకుపోవడం మాత్రమే కాకుండా తమ అభిమానుల కోసం ఏం చెయ్యడానికైనా సిద్ద పడుతున్నారు మరియు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తమ మానవతాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికేపవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, శృతి హాసన్ లాంటి వారు అభిమానులకు తమ వంతు సాయం చేసారు. తాజాగా వీరి లిస్టులో నాగ చైతన్య కూడా చేరి ఒక బేబీ గర్ల్ ప్రాణాన్ని కాపాడాడు.

పూర్ణిమ అనే బేబీ గర్ల్ చెస్ట్ కి సంబందించిన ఓ వ్యాధితో బాధపడుతోంది. తనని హైదరాబాద్ హాస్పిటల్ లో చేర్చారు. పూర్ణిమకి మేజర్ హార్ట్ సర్జరీ చేసారు, అలాగే తను 3నెలల నుంచి ఐసియు మరియు వెంటిలేషన్ పై ఉంది. తన మందులకు కావాల్సిన ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో ఈ కేసును సమంత స్థాపించిన ప్రత్యూష ఫౌండేషన్ వారు ఇన్వాల్వ్ అయ్యి డొనేషన్స్ కోసం ఫండ్స్ రైజ్ చేసారు. ఈ విషయంపై స్పందించిన నాగ చైతన్య 3 లక్షలు ఇచ్చి పూర్ణిమకి హెల్ప్ చేసాడు. దాంతో పూర్ణిమ కి చాలా హెల్ప్ అవ్వడమే కాకుండా రికవర్ కూడా అయ్యింది. నాగ చైతన్య చేసిన ఈ హెల్ప్ పూర్ణిమకి ఎంతో హెల్ప్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు