నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ రిలీజ్ డేట్ లాక్.. వచ్చేది ఎప్పుడంటే..?

నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ రిలీజ్ డేట్ లాక్.. వచ్చేది ఎప్పుడంటే..?

Published on Mar 28, 2026 8:02 AM IST

Bad Boy Karthik

యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ విడుదలకు సిద్ధమవుతోంది. రామ్ దేసిన ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని, మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న థియేటర్లలోకి రానుంది. త్వరలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనుంది.

​ఈ సినిమాలో నాగశౌర్య సరసన విధి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి మరియు శ్రీదేవి విజయ్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

​సాంకేతిక విభాగం విషయానికి వస్తే, ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

తాజా వార్తలు