మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన నెక్స్ట్ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించాడు. ‘బరి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక తాజాగా ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్రానికి క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించాడు. బాబాయ్ చేతుల మీదుగా సినిమా ప్రారంభం కావడంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ప్రస్తుతం ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.


