నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ‘@నర్తనశాల’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రం ప్రధానంగా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో అంచనాలు పెంచేలా రూపొందుతుంది అట. నాగశౌర్యకు ఛలో చిత్రం తర్వాత మళ్ళీ ఈ చిత్రం ద్వారా భారీ విజయాన్ని అందుకోనున్నారని చిత్రబృందం నమ్మకంగా ఉంది.
ముఖ్యంగా ఈ చిత్రంలో ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలు చాలా బాగా వచ్చాయట. జంధ్యాలగారి సినిమా శైలిలో చక్కటి హాస్యం ఈ సినిమాలో ఉందని తెలుస్తోంది. ఐరా క్రియేషన్స్ పతాకం ఫై నాగశౌర్య తల్లి ఉషా మూల్పూరి నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


