దర్శకుడిగా మారిన నాగ శౌర్య

Naga Shaurya1
‘ఛలో’ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కిన యువ హీరో నాగ శౌర్య. ఇంతకూ ముందులా కాకుండా ఆచి తూచి కథల్ని ఎంచుకుంటున్న ఆయన ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకుని దర్శకుడిగా కూడ మారారు. అయితే ఆ దర్శకత్వం సినిమాకి కాదు షార్ట్ ఫిల్మ్ కోసం. అవును.. నాగ శౌర్య మాతృ దినోత్సవం కోసం ‘భూమి’ అనే పేరుతో ఒక షార్ట్ ఫిల్మ్ ను రూపొందించారు.

దాన్ని రేపు 13వ తేదీన మథర్స్ డే సందర్బంగా విడుదలచేయనున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై శౌర్య తల్లిదండ్రులు ఉష మల్పూరి, శంకర్ ప్రసాద్ లు నిర్మించారు. ఇకపోతే శౌర్య ప్రస్తుతం నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Exit mobile version