నాగ శౌర్య మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది.!

నాగ శౌర్య మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది.!

Published on Oct 28, 2020 1:10 PM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య ఓ ఆసక్తికరం స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దానికోసం ఊహించని విధమైన ఫిట్నెస్ లుక్ ను ప్రిపేర్ చేసి స్టన్ చేసాడు. ఇక ఇది ఇలా లైన్ లో ఉండగానే నాగశౌర్య హీరోగా టాలెంటెడ్ దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవలే కన్ఫామ్ అయ్యినట్టు తెలిసిందే.

గత కొన్నాళ్ల కితమే ప్రకటించబడిన ఈ చిత్రం ఇపుడు పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్న ఈ చిత్రం లాంచ్ లో ప్రముఖ ఇండస్ట్రీ పెద్దలు అంతా పాల్గొన్నారు. నిర్మాత నాగవంశీ మేకర్స్ కు స్క్రిప్ట్ ను అందించగా ముహూర్తం షాట్ ను అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

అలాగే దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా నారా రోహిత్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ చిత్రానికి ప్రస్తుత యువ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతం అందించనుండగా ఐరా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను డిసెంబర్ నుంచి స్టార్ట్ చెయ్యనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు