తన తర్వాత సినిమా కోసం ‘వాషింగ్టన్ డిసి’లో షాపింగ్ చేసిన యంగ్ హీరో !

Published on Jul 26, 2018 8:55 am IST

నూతన దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ‘అమ్మమ్మగారిల్లు’ చిత్రం తరువాత యువ హీరో నాగశౌర్య నటిస్తున్న చిత్రం ‘@నర్తనశాల’. నాగశౌర్య తన సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్ పై ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం యు.యస్ లో ఉన్న నాగశౌర్య తన తరువాతి సినిమా కోసం ‘వాషింగ్టన్ డిసి’లో షాపింగ్ చేశారు. అలాగే ఈ వారాంతంలో ‘@నర్తనశాల’ సాంగ్ ను కూడా లాంచ్ చేయనున్నారు.

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య సరసన యామిని భాస్కర్, కశ్మీర ప్రదేశి కథానాయికలుగా నటిస్తున్నారు. మొదటి సినిమా ‘ఛలో’ తో సూపర్ హిట్ కొట్టిన నిర్మాత ‘నాగశౌర్య మదర్’ ఉషా ములుపురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :