యంగ్ హీరో సినిమా క్యాన్సల్ అయ్యిందట !

Published on Apr 3, 2019 3:56 pm IST

ఛలో తరువాత చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్లు కావడంతో తదుపరి సినిమాలకు చాలా కేర్ తీసుకుంటున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం ఈ హీరో రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో తనకు ఊహలు గుసగుస లాడే వంటి హిట్ ఇచ్చిన శ్రీనివాస్ అవసరాల తో ఒక సినిమా చేయనుండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ , శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న మరొక చిత్రం.

ఈ చిత్రం తో సుకుమార్ తన అసిస్టెంట్ డైరెక్టర్ ను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నాడు అయితే కారణాలు తెలియవు గాని ఇప్పుడు ఈ సినిమా క్యాన్సల్ అయ్యిందట. దాంతో నాగశౌర్య , శ్రీనివాస్ అవసరాల తో చేయబోయే సినిమా ఫై ఫుల్ ఫోకస్ పెట్టాడట. ఇక శౌర్య, సమంత లేడీ ఓరియెంటెడ్ మూవీ ఓ బేబీ లో ఓ కీలక పాత్ర లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం :