అశ్వథామ బులితెరపై చెలరేగాడు..!

Published on May 22, 2020 11:01 am IST

యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ హిట్ అశ్వథామ. హీరో నాగ శౌర్య కొత్తగా ట్రై చేయగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వసూళ్ల పరంగా పరవాలేదనిపించింది. కాగా ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ బుల్లి తెరపై ప్రసారం చేయగా భారీ టి ఆర్ పి దక్కిచుకుంది. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం అశ్వథామ మూవీ 9.10 టి ఆర్ పి దక్కించుకొని అబ్బురపరిచింది. ఇది నాగ శౌర్య గత చిత్రాల అన్నింటికీ మించినది కావడం గమనార్హం.

వైజాగ్ వేదికగా జరిగే ఓ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథను స్వయంగా నాగ శౌర్య సమకూర్చగా, నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించారు. ఇక ఈ మూవీని ఐరాస క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా ములుపూరి నిర్మించారు. ఇక బబ్లీ బ్యూటీ మెహ్రీన్ నాగ శౌర్యకు జంటగా నటించింది. శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. అశ్వథామ మూవీ ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది.

సంబంధిత సమాచారం :

More