ఇంటర్వ్యూ : నాగశౌర్య – @ నర్తనశాల డిఫ్రెంట్ గా ఉంటుంది !

ఇంటర్వ్యూ : నాగశౌర్య – @ నర్తనశాల డిఫ్రెంట్ గా ఉంటుంది !

Published on Aug 28, 2018 4:41 PM IST

ఛలో సినిమా తో సూపర్ హిట్ కొట్టిన యువ హీరో నాగ శౌర్య నటించిన తాజా చిత్రం @నర్తనశాల. ఈచిత్రం రేపు విడుదలకానున్న సంధర్బంగా నాగశౌర్య మీడియాతో మాట్లాడారు ఆయన ఏం అన్నారో ఇప్పుడు చూద్దాం.

సినిమాకు @ పెట్టడానికి గల కారణం ?

నర్తనశాల పేరుతో చాలా సినిమాలు వచ్చి ఆగిపోయాని నాన్న చెప్పారు. అందుకే సెంటిమెంట్ గా @అని పెట్టాం. నర్తనశాల టైటిల్ ఈ స్టోరీకి కరెక్ట్ గా సరిపోతుంది.

ఈ సినిమా సబ్జెక్టు ఏంటి ?

సినిమా సబ్జెక్టు అంటే ఇందులో గే పాత్రలో నటించాను. ఇద్దరు అమ్మాయిలు అతన్ని లవ్ చేస్తే ఎలావుంటదనేదె కథ. చిన్న మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలతో ఉంటుంది ఈచిత్రం.

టైటిల్ కు సబ్జెక్ట్ కు సంభందం ఏమిటి ?

దింట్లో కథ డిఫ్రెంట్. కాని గే అని క్యారెక్టర్ వుంది కాబట్టి నర్తనశాల సినిమా చూసి ఈ టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుంది అని అదే టైటిల్ ను పెట్టాం.

మీ పాత్ర ఎలా ఉంటుంది ?

సినిమాలో అమ్మాయిలను బాగా సపోర్ట్ చేసే పాత్ర వాళ్ళు పడే కష్టాలేంటి అనేది తెలుసుకుంటాను. ఈసినిమాలో నా పాత్ర తో పాటు అజయ్, శివాజీరాజా, జయ ప్రకాష్ రెడ్డి గార్లది ముఖ్యమైన పాత్రలు.

సోలోగా రావడం అడ్వాంటేజ్ గా భావిస్తున్నారా ?

శైలజారెడ్డి అల్లుడు వస్తుందనుకున్నాం కానీ కేరళలో వరదలవల్ల వర్క్ డిలే అయింది. ఆలా జరుగకూడదు కానీ ఇద్దరికే మంచిదే. ఈ రెండు చిత్రాల మధ్య రెండు వారాల గ్యాప్ వస్తుంది. దాని వల్ల రెండు చిత్రాలకు మంచి జరుగుతుంది.

దర్శకుడి గురించి ?

శ్రీనివాస్ చక్రవర్తి కొత్త దర్శకుడు ఇంతకుమందు చాలా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈచిత్రాన్ని బాగా తీశాడు. ఈసినిమా తరువాత ఇండస్ట్రీ లో బిజీ అయిపోతాడు.

మల్టీ స్టారర్ చిత్రం చేసే అవకాశం ఉందా ?

అస్సలు లేదండి. ఇంతకుముందు నారా రోహిత్ తో చేశాను. అది రోహిత్ నాకు బాగా తెలుసు నాకు బాగా కనెక్ట్ అయ్యాడు కాబట్టి చేశాను ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు.

మీ తదుపరి చిత్రాల గురించి ?

రమణ తేజ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాను. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రానికి కూడా సాగరే సంగీతం అందిస్తున్నాడు. ఇది గాక ఇంకా రెండు చిత్రాలకు కమిట్ అయ్యాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు