ఆ యంగ్ హీరో మరో సినిమా కూడా ఆగిపోయిందట!

Published on Apr 12, 2019 3:00 am IST

ఛలో తరువాత వరుస పరాజయాలతో కెరీర్ ను రిస్క్ లో పడేసుకున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఇక ప్రస్తుతం ఆయనకు ఏది కలిసి రావడం లేదు. @నర్తనశాల తరువాత శౌర్య మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ , శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కనున్న చిత్రం ఒకటి. అయితే కారణాలు తెలియవు గాని ఈసినిమా లాంచ్ కాకముందే క్యాన్సల్ చేశారట.

ఇది పోతే పోయింది అనుకుంటే ఇప్పుడు మరో సినిమా ను కూడా మధ్యలోనే ఆపేశారట. ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో నూతన దర్శకుడు రాజు కొలుసు, శౌర్య తో ఓ చిత్రం తెరకెక్కించాల్సి వుంది. అయితే సగానికి పైగా సినిమా షూటింగ్ అయ్యాక అవుట్ ఫుట్ ఆనంద్ ప్రసాద్ కు నచ్చకపోవడంతో సినిమా ను ఆపేస్తున్నాని చెప్పేశాడట. దాంతో ఈ సినిమా కూడా క్యాన్సల్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.

ఇక శౌర్య కు మిగిలింది ఒకటే ఒక చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ ఆవసరాల తెరకెక్కించనున్నాడు. మరి ఈ చిత్రమైన ఎలాంటి అవరోధాలు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :