త్వరలో మొదలుకానున్న నాగ శౌర్య కొత్త సినిమా !
Published on Mar 9, 2018 2:45 pm IST

‘ఛలో’ సినిమాతో మంచి విజయం సాధిచిన నాగశౌర్య కొత్త దర్శకుడు శ్రీనివాస్ తో సినిమా చెయ్యబోతున్నాడు. శ్రీనివాస్ గతంలో కృష్ణ వంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచెయ్యడం జరిగింది. ఐరా క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. ఈ నెల మూడో వారంలో సినిమా పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభంకానుంది.

ఈ సినిమాతో పాటు కాశీ విశ్వనాధ్ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు నాగ శౌర్య. ఈ ప్రాజెక్ట్ వచ్చే నెల ప్రారంభంకానుంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కబోతున్నాయి. శ్రీనివాస్ సినిమాకు ‘నర్తనశాల’ టైటిల్ పరిశీలనలో ఉంది.

 
Like us on Facebook