‘గాడ్ ఆఫ్ వార్’పై బిగ్ అప్డేట్… నాగ వంశీ పోస్ట్‌తో పెరిగిన ఆసక్తి

‘గాడ్ ఆఫ్ వార్’పై బిగ్ అప్డేట్… నాగ వంశీ పోస్ట్‌తో పెరిగిన ఆసక్తి

Published on Jun 28, 2026 9:15 PM IST

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా అప్డేట్ కోసం అభిమానులు గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రకటన వస్తుందని ఆశించినా, ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో వారు నిరాశ చెందారు.

అయితే ఇప్పుడు నిర్మాత నాగ వంశీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. రేపు ఒక పెద్ద ప్రకటన రానుందని ఆయన వెల్లడించగా, పోస్టులో ఉపయోగించిన ఎమోజీ అది ‘గాడ్ ఆఫ్ వార్’ గురించే అనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

దీంతో ఇప్పుడు అందరి దృష్టి రేపటి ప్రకటనపైనే ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తారా, ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తారా, లేక మరో సర్‌ప్రైజ్ ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు