ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు !
Published on Jun 23, 2018 12:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం వరకు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదలకానుంది. ఈ చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక పాత్ర చేయనున్నారని గతంలోనే వార్తలొచ్చాయి.

తాజా సంచారం మేరకు నాగబాబు సినిమాలో తారక్ కు తండ్రిగా నటిస్తున్నారని తెలుస్తోంది. అంతేగాక ఆయన పాత్ర కథకు చాలా కీలకమైనదని, ఆయనకు, ఎన్టీఆర్ కు నడుమ భావోద్వేగపూరితమైన సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. ఇలా ఎన్టీఆర్, నాగబాబు కలిసి నటించడం ఇదే మొదటిసారి.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ హెవీ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉండబోయే ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook