‘నాగబంధం’ అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ ఓపెనింగ్ పై ఆశలు !

‘నాగబంధం’ అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ ఓపెనింగ్ పై ఆశలు !

Published on Jun 29, 2026 3:15 PM IST

యంగ్‌ హీరో విరాట్‌ కర్ణ అవైటెడ్ పాన్‌-ఇండియా సినిమా “నాగబంధం”. 2026 జులై 3న భారీ స్థాయిలో విడుదల కానుంది ఈ చిత్రం. ఐతే, ముందుగా ప్రకటించిన విధంగానే, వివిధ భాషలు మరియు ఫార్మాట్లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు విడుదలైన అద్భుతమైన విజువల్స్ మరియు పాటల ద్వారా ఏర్పడిన భారీ అంచనాల దృష్ట్యా, ప్రేక్షకుల నుండి గొప్ప స్పందన లభిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది.

కాగా ఈ చిత్రంలో జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, దక్షా నాగర్కర్ కీలక పాత్రలు పోషించారు. నిర్మాత అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌ స్కేల్‌లో రాబోతుంది. అన్నట్టు ‘నాగబంధం’ నిడివి సుమారు 3 గంటల 15 నిమిషాలుగా ఖరారైంది. మరి సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ చిత్రం యొక్క జానర్ మరియు కథాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే అది పెద్ద సమస్య కాకపోవచ్చు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు