టాలీవుడ్ లో కింగ్ అక్కినేని నాగార్జున తన కంటూ ఓ ప్రత్యేక, సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన కెరీర్లో ఎన్నో మధురానుభూతులు ఉన్నా 2014 సంవత్సరం మాత్రం నాగార్జునకి చాలా ప్రత్యేకం అని చెప్పాలి. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు కలిసి చేసిన ‘మనం’ సినిమా ఈ ఏడాది విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. అలాగే నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం విజయాన్ని సాధించి ఎంతో మంది మన్ననల్ని పొందింది.
ఇవి కాకుండా నాగార్జున ఈ ఏడాది సోషల్ మీడియాలో కూడా మరో మైలురాయిని సాధించాడు. నాగార్జున ఫేస్ బుక్ పేజ్ వన్ మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లోని కొంతమంది హీరోలకే ఆ ఘనత దక్కింది. ఇప్పుడు వారికి నాగార్జున పోటీగా మారారు. నాగార్జున తన తదుపరి సినిమా కొత్త డైరెక్టర్ తో చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.


