అక్కినేని నాగర్జున గత చిత్రాలు ‘ఆఫీసర్, దేవదాస్, మన్మథుడు 2’ చిత్రాలు పరాజయం చెందడంతో ట్రాక్ మార్చారు. ఈసారి సీరియస్ సబ్జెక్ట్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ కథలో ఆయన వయసు మీద పడిన వ్యక్తిగా కనిపిస్తారట. పైగా అది సీరియస్ పోలీస్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. ఇప్పటి వరకు కొన్ని ప్రయోగాలు చేసిన ఆయన ఈసారి తప్పక విజయం సాధించాలనే పట్టుదలతో సినిమా చేస్తున్నారట.
వయసు రీత్యా చూసుకుంటే నాగార్జునకు ఇది సరైన పాత్రే అవుతుంది. నూతన దర్శకుడు సొలొమన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా మ్యాటనీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. ఇందులో నాగర్జునతో పాటు కొందరు యంగ్ స్టార్స్ కూడా నటించే వీలుంది. మరి ఈ సీరియస్ పోలీస్ స్టోరీ అయినా నాగర్జునకు హిట్ ఇస్తుందేమో చూడాలి.
