జరిగిన మార్పులు నాగార్జునకు నచ్చాయట

Published on Jun 29, 2021 1:09 am IST

కింగ్ నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. తన గత చిత్రం ‘వైల్డ్ డాగ్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమా మీద నాగార్జున చాలా హోప్స్ పెట్టుకుని ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా ప్రేక్షకులు మెచ్చేలా ఉండాలనేది నాగార్జున అభిమతం. అందుకే స్క్రిప్ట్ విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉంటున్నారు. ప్రవీణ్ సత్తారు మొదట ఈ కథను పూర్తిగా యాక్షన్ జానర్లో రాసుకోవడం జరిగిందట. కానీ ‘వైల్డ్ డాగ్’ రిజల్ట్ మార్పులకు కారణం అయిందట. ఈసారి ఒట్టి యాక్షన్ కంటెంట్ మీద ఆధారపడకుండా ఫ్యామిలీ, ఫన్ ఎంటర్టైన్మెంట్ కూడ ఉండేలా చూసుకుంటే బాగుంటుందని డిసైడ్ అయ్యారట.

అందుకోసమే ప్రముఖ రచయిత అబ్బూరి రవిని రంగంలోకి దింపడం జరిగిందట. ప్రవీణ్ సత్తారు కథకు అబ్బూరి రవి ఇచ్చిన అదనపు హంగులు చాలా బాగున్నాయని టాక్. నాగార్జున, ప్రవీణ్ సత్తారు కూడ ఫైనల్ ఔట్ ఫుట్ పట్ల సంతృప్తికరంగా ఉన్నారట. త్వరలోనే షూటింగ్ రీస్టార్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు టీమ్. ఇందులో నాగార్జునకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించనుంది. నాగార్జున, కాజల్ కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

సంబంధిత సమాచారం :