నాగ్, నానీల మల్టీ స్టారర్ మొదలయ్యేది ఎప్పుడంటే !

23rd, January 2018 - 08:29:53 AM

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో నాగార్జున, ఎప్పటికప్పుడు కొత్త తరహా కథల్ని ఎంచుకుంటూ పేక్షకుల్ని అలరిస్తున్న యంగ్ హీరో నానిలు కలిసి మల్టీస్టారర్లో నటించనున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24 నుండి మొదలుపెడతారని సమాచారం. ప్రముఖ దర్శకుడు అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్రంలో మంచి మలుపులతో కూడిన కథ కథనాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నాగార్జునాన్ ఆర్జీవీ చిత్రంలోను, నాని ‘కృష్ణార్జున యుద్ధం’ లోను నటిస్తున్న సంగతి తెలిసిందే.