అఖిల్ సినిమా విషయంలో నాగార్జున అభ్యంతరం

Published on May 19, 2021 12:31 am IST

అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సహా సినిమా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. కానీ విడుదలే కుదరడం లేదు. పలుమార్లు వాయిదాపడిన ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదలచేయలని డిసైడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డేట్ మిస్ కాకూడదని ప్లాన్ చేసుకున్నారు. కానీ లాక్ డౌన్ పడటంతో ఆ డేట్ కూడ మిస్సయ్యేలా ఉంది. జూన్ 19కి సినిమా హాళ్లు తెరుచుకుంటాయనే నమ్మకమైతే లేదు. సో.. మరోసారి వాయిదా తప్పేలా లేదు.

ఇక ఈ చిత్రానికి ఓటీటీ సంస్థల నుండి ఆఫర్లు వస్తున్నాయట. స్ట్రీమింగ్ హక్కులకు భారీ మొత్తం చెల్లించడానికి పలు సంస్థలు సిద్దంగా ఉన్నాయి. ఈ ఆఫర్ల విషయంలో నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్ స్పందన ఎలా ఉన్నా నాగార్జున మాత్రం ససేమిరా అంటున్నారట. తన కుమారుడి చిత్రం ఎంత ఆలస్యమైనా ముందుగా థియేటర్లలోనే రావాలని, ఓటీటీకి వెళ్లకూడదని గట్టిగా అనుకుంటున్నారట. మరి నాగార్జునే అంత గట్టిగా అనుకుంటే సినిమా ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ లేనట్టే. ఇకపోతే కెరీర్లో ఇప్పటివరకు సాలిడ్ హిట్ దొరక్క ఇబ్బందిపడుతున్న అఖిల్ ఈ చిత్రం మీద చాలానే ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :