మరోసారి ‘మనం’ తరహా చిత్రంలో అక్కినేని ఫ్యామిలీ…!

Published on Jun 17, 2019 8:20 am IST

నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు2’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా తరువాత డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున,నాగచైతన్య కలసి ‘బంగార్రాజు’ అనే సినిమాలో నటించేందుకు సిద్దమయ్యారట. .ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న నాగార్జున ఎలాగైనా సినిమాని త్వరగా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ గా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తీసుకున్నారని సమాచారం. మరోవిశేషం ఏమిటంటే నాగచైతన్య కు జంటగా కనిపించనున్న సమంత , నాగార్జున మనవరాలి పాత్రలో కనిపిస్తుందని ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ‘మనం’ మూవీ తరహాలో దాదాపు అక్కినేని ఫ్యామిలిలో ప్రముఖ నటులందరూ నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది. .సమంత నటించిన ‘ఓ బేబీ’ చిత్రం జులై 5న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More