‘మనం’ లాంటి సినిమా సూపర్ హిట్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవలే తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ సినిమాకి ‘సోగ్గాడే చిన్నినాయన’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ హౌస్ సెట్ ని డిజైన్ చేసారు. ప్రస్తుతం అందులో కుటుంబ నేపధ్యంలో వచ్చే కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేయనున్నాడు. అందులో ఓ పాత్రకి లావణ్య
త్రిపాటి జోడీగా నటిస్తుంటే, మరో పాత్రకి జోడీగా అలనాటి రమ్యకృష్ణ నటిస్తోంది. ఒక రూరల్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా కథని రెడీ చేసాడని సమాచారం. ఈ సినిమాకి రాధా మోహన్ కథ – స్క్రీన్ ప్లే అందించాడు.


