రామోజీ ఫిల్మ్ సిటీలోని ఠాగూర్ హౌస్ లో బ్రహ్మానందంను ఆట పట్టిస్తున్నారు కింగ్ నాగార్జున. ‘మనం’ తర్వాత నాగార్జున నటిస్తున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. డిఫరెంట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటివలే రామోజీ ఫిల్మ్ సిటీలోని ఠాగూర్ హౌస్ లో నాగార్జున, బ్రహ్మానందంలపై వినోదభరిత సన్నివేశాలను చిత్రీకరించారు. బ్రహ్మి స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం.
కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో నాగార్జున నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ కధానాయికలు. ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత. ‘హలో బ్రదర్’ తరహాలో వినోదాత్మక సినిమా అని సమాచారం.


